28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

Manchu Family |అన్నదమ్ముల మధ్య ఫైటింగ్.. రోడ్డునపడ్డ మంచు కుటుంబ వివాదం..

Manchu Family |మంచు విష్ణు, మనోజ్‌ మధ్య వివాదం రోడ్డునపడింది. అన్న విష్ణుతో వివాదాన్ని స్టేటస్‌గా పెట్టాడు మనోజ్‌. మనోజ్‌ ఫేస్‌బుక్ స్టోరీ పోస్ట్‌తో ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. వారి మధ్య విబేధాలను బయటపెట్టింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను, బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టాడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు సారథి అనే వ్యక్తి. ఆయన మోహన్ బాబుకు వరసకు సోదరుడు అవుతారు. మొదట్లో సారథి.. విష్ణుకు కుడిభుజంలా ఉంటూ వచ్చారు. కాలక్రమేణా విష్ణు నుంచి దూరం జరిగి.. మోహన్ బాబుకు దగ్గరయ్యారు. ఈ మధ్య మంచు మనోజ్‌‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ.. అతడి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో సారథి ఇంటికెళ్లి అతన్ని కొట్టబోయాడు మంచు విష్ణు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను విడుదల చేశాడు మనోజ్. విష్ణు తరచూ ఇలా చేస్తున్నాడంటూ మనోజ్‌ కామెంట్‌ చేశారు. మంచు మనోజ్.. తాజాగా డయల్ 100కి కాల్ చేశాడు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్తున్నారు. మనోజ్, విష్ణుపై కేసు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Manchu Family |కాగా ఇటీవల మనోజ్ పెళ్లి సమయంలో కూడా విష్ణు తన ఫ్యామిలీతో కలిసి జస్ట్ ఓ గెస్ట్‌గా మాత్రమే వచ్చి వెళ్లాడు. దీంతో వారి మధ్య గ్యాప్ వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి మధ్య విబేధాలు నిజమే అని తాజా ఘటనతో తేటతెల్లమైంది.

 Read Also: పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసు… శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్