పటోళ్ల గోవర్ధన్ రెడ్డి(Patolla Goverdhan Reddy) హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్న ను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. అయితే 11 ఏళ్ళ సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు తీర్పును వెలువరించడం గమనార్హం.
విప్లవ దేశభక్త పులులు సంస్థ వ్యవస్థాపకుడు, పరిటాల రవి(Paritala Ravi) హత్య కేసులో నిందితుడిగా ఉండి నిర్దోషిగా విడుదలైన పటోళ్ల గోవర్దన్ రెడ్డి(Patolla Goverdhan Reddy) 2012 డిసెంబర్ 27న హత్యకు గురయ్యారు. హైదరాబాదులోని సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో గల బొగ్గులకుంట ప్రాంతంలో అతన్ని దారుణంగా హత్య చేశారు. అయితే ఈ కేసులో 20 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇందులో ప్రధాన నిందితుడిగా శేషన్న ఉన్నారు. ఫిబ్రవరి 2018 లో శేషన్నను పోలీసులు అరెస్ట్ చేయగా… 11 ఏళ్ళ సుదీర్ఘ విచారణ తర్వాత శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ నేడు నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది.
Read Also: ఎండాకాలం చర్మం నల్లబడుతోందా.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసం..
Follow us on: Youtube Instagram