నవ వధువుపై కన్నేసిన నకిలీ బాబా.. కళ్లకు గంతలు కట్టి అత్యాచారం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: టెక్నాలజీ రోజు రోజుకు ఎంత పెరగిపోతున్నా.. ఇంకా కొందరు మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. అయితే.. ఇలాంటి వారిని ఆసరా చేసుకొని కొందరు దొంగ బాబాలు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఫేక్‌ బాబాల(Fake Baba) నిర్వాకం వెలుగులోకి వచ్చినవే. అయితే.. ఇప్పుడు హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ ఫేక్‌ బాబా గుట్టు రట్టైంది. ముఖ్యంగా  రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఎల్బీ నగర్‌లో మహిళపై పోలీసుల దాడి, నిన్న నానక్‌రామ్ గూడలో మహిళపై అత్యాచారం చేసి హత్య వంటి ఘటనలు విచారణ జరుగుతూనే ఉంది.

తాజాగా నగరంలో మరో దారుణం వెలుగుచూసింది. హైదరాబాద్‌లోని (Hyderabad) పాతబస్తీ బండ్లగూడలో (Bandlaguda) ఓ నకిలీ బాబా దారుణానికి ఒడిగట్టాడు. ఓ నవవధువుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె అత్తమామలు బాబా దగ్గరికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నవ వధువుపై కన్నేసిన నకిలీ బాబా ఆమె అత్యాచారానికి పాల్పడ్డాడు. పక్క గదిలోకి తీసుకెళ్లి తన కళ్లకు గంతలు కట్టి బాబా తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నకిలీ బాబా పరారీలో ఉన్నట్లు సమాచారం. బాబా కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్