స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ(Congress) స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీసీల కోసం నల్లగొండ నియోజకవర్గ సీటు త్యాగం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. పీఈసీ(PEC) సభ్యులతో ఏఐసీసీ(AICC) మాట్లాడాలని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రతిపాదించారని.. దీనిని అందరం మూకుమ్మడిగా అంగీకారం తెలిపామని స్పష్టం చేశారు. అందరి బలాలు పరిశీలిస్తాం.. సమర్థులకే టికెట్లు కేటాయిస్తామని అన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు టికెట్లు బలహీన వర్గాలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందన్నారు.
అవసరం అనుకుంటే బీసీలకు నల్గొండ వదిలేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిక్లరేషన్లు అమలు చేస్తామని.. లేకుంటే రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడెకరాలిస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పాని ఆయన దుయ్యబట్టారు. మాట తప్పితే తల నరుక్కుంటానని అన్నారని.. కేసీఆర్ ఏం చేశారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లారంటే ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు.