వివాహేతర సంబంధం.. పక్కా స్కెచ్‌ వేసి కానిస్టేబుల్‌ను హత్య చేసిన భార్య

స్వతంత్ర  వెబ్ డెస్క్: భర్తతో ఉన్న విభేదాల నేపథ్యంలో ప్రియుడు, అతని స్నేహితుడు సహయంతో భర్తను అంతం చేసిన భార్య వ్యవహారం విశాఖపట్నంలో సంచలనం సృష్టించింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేష్‌ను పక్కా ప్రణాళికతో హతమార్చిన వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. నిద్రిస్తున్న భర్తను ఇంట్లోనే పథకం ప్రకారం దిండుతో ఊపిరి ఆడకుండా చేసి గుండెనొప్పిగా చిత్రకరించారు.

అంత్యక్రియల సమయంలో స్థానికుల అనుమానం వ్యక్తం చేయడంతో భార్య శివ జ్యోతి అలియాస్ శివానిని పోలీసులు నిలదీయడంతో దొరికిపోయింది. ట్యాక్సీ డ్రైవర్‌తో వివాహితర సంబంధం నేపథ్యంలో భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడి సహాయంతోనే హత్య కు పక్కాగా ప్లాన్ చేసింది. భర్తను చంపేసి గుట్టుచప్పుడు కాకుండా అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది.

ఆరోగ్యంగా ఉన్న కానిస్టేబుల్ హత్యకు గురికావడంతో అనుమానించిన విశాఖ ఎంవీపీ పోలీసులు విచారణ జరిపారు. విచారణలో అక్రమ సంబంధం వ్యవహారం వెలుగు చూడటంతో భార్యను తమదైన శైలిలో విచారించగా హత్యకు పాల్పడినట్టు ఒప్పుకుంది. విశాఖలో బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విశాఖ వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ కేసును హత్యగా పోలీసులు చివరకు హత్యగా నిర్ధారించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. మరో వ్యక్తి సాయంతో ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు గుర్తించారు.

కానిస్టేబుల్‌ను చంపడానికి ముందు మద్యం తాగించారా? లేక విషమిచ్చి ఆ తర్వాత హత్య చేశారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలొస్తే కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. విశాఖ వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో అసిస్టెంట్‌ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న బర్రి రమేష్‌కుమార్‌ (40) నగరంలోని ఎంవీపీ కాలనీలో భార్య శివజ్యోతి, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 1వ తేదీ విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన రమేష్‌ తెల్లవారేసరికి గుండెపోటుతో మృతి చెందారంటూ భార్య శివాని ఎంవీపీ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ మల్లేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా, భార్య ప్రవర్తన సందేహాస్పదంగా కనిపించడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్