మాజీ మంత్రి రోజా త్వరలో జైలుకెళ్లడం ఖాయం అన్నారు తిరుపతి జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మంత్రిగా రోజా చేసిన అవినీతి ఒక్కొకటిగా బయటకు వస్తున్నాయని ఆయన చెప్పారు. రోజా అవినీతిని ఆధారాలతో సహా త్వరలో బయటపెడతామని ఎమ్మెల్యే భానుప్రకాష్ అన్నారు. ‘ఆడుదాం ఆంధ్ర’ అంటూ రోజా కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. టూరిజంశాఖలో కూడా భారీ అవినీతి చేసినట్లు చెప్పారు. విజయవాడలో ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలు రోజాకు కనబడడం లేదా అని ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని నగరి ఎమ్మెల్యే స్పష్టం చేశారు.