హైదరాబాద్ సికింద్రాబాద్‌లో విదేశీ డ్రగ్స్ కలకలం రేపింది. 33 గ్రాముల మత్తు మందును పోలీసులు పట్టుకున్నారు. లాలాపేట పరిధిలో అమ్ముతుండగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మత్తు మందు అమ్ముతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు మాటువేసి మహమ్మద్ ఖాన్, మహమ్మద్ ముబీన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి 23 గ్రాముల కన్నాబీస్ స్వాధీనం చేసుకొని, మరో వ్యక్తి నిఖిల్ నాయక్ వద్ద 10 గ్రాముల డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కన్నా బిస్ విలువ లక్షా 32వేలు ఉంటుందని చెప్పారు. విదేశాల నుండి అక్రమం గా సముద్ర మార్గం ద్వారం బెంగళూరు కొరెనూర్‌కు సరఫరా అవుతున్నట్లు గుర్తించామన్నారు.


