కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు విజయ డైరీ పేరుతో తమ పాల ప్యాకెట్లను విక్రయిస్తున్నారని..తెలంగాణ డైరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. అలాంటి పాలను కొనుగోలు చేయవద్దని ఆయన పేర్కొన్నారు. లాలాపేట్‌లోని విజయ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డైరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజలు విజయ తెలంగాణ అని బ్రాండ్ ఉంటేనే పాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా తెలంగాణ నకిలీ పాలను డిస్ట్రిబ్యూటర్స్ వెండర్స్ కొనుగోలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే తాము కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ఇలాంటి నకిలీ విజయ పాలతో వచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని సూచించారు.
ఆ పాలను కొనుగోలు చేయవద్దు- అమిత్‌రెడ్డి
0
196
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


