టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్.. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న మూవీ కుబేర. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఎప్పుడో రావాలి కానీ.. కొన్ని కారణాల వలన ఆలస్యం అయ్యింది. ఇప్పుడు కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ రిలీజ్ డేట్ ను రష్మిక అనౌన్స్ చేసింది. అయితే.. ఈ మూవీకి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉంది. ఇంతకీ.. కుబేర వచ్చేది ఎప్పుడు..? కుబేర టీమ్ నమ్ముతున్న ఆ సెంటిమెంట్ ఏంటి..?
కుబేర.. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన క్యారెక్టర్స్ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుని.. మూవీ పై మరింతగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఇందులో నాగార్జున, ధనుష్ క్యారెక్టర్స్.. ఎవరూ ఊహించని విధంగా.. ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇటీవల ఈ మూవీ టైటిల్ తమదే అంటూ ఓ నిర్మాత మీడియా ముందుకు రావడంతో కుబేర మరింత ఆలస్యం అవుతుందేమో అని వార్తలు వచ్చాయి కానీ.. ఈ చిత్రాన్ని జూన్ 20న రిలీజ్ చేస్తున్నట్టుగా క్రేజీ హీరోయిన్ రష్మిక సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేయడం విశేషం. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
క్రేజీ హీరోయిన్ రష్మిక బాలీవుడ్ లో నటించిన పుష్ప, యానిమల్ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. ఇప్పుడు రష్మిక నటించిన ఛావా సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. దీంతో రష్మిక పేరు బాలీవుడ్ లో మారమ్రోగుతోంది. కుబేర మూవీలో కూడా రష్మిక నటించడంతో సెంటిమెంట్ ప్రకారం ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూటు మార్చి ఈ సినిమా చేయడం.. ఇందులో భారీ యాక్షన్ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువుగా ఉండడంతో జూన్ 20న కుబేర పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి.. రష్మిక సెంటిమెంట్ వర్కవుట్ అయి కుబేర అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాలి.


