నాగర్‌కర్నూల్ జిల్లా: జేపీ గెస్ట్‌హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గెస్ట్‌హౌస్‌లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో వారిని అడ్డుకున్నారు. అధికారులను కలిసేందుకు అనుమతించాలంటూ హరీశ్‌రావు కోరారు. దీంతో హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
SLBC సొరంగం వద్ద ఇప్పటికైనా శిథిలాల తొలగింపు పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వానికి సూచించారు మాజీ మంత్రి హరీశ్‌రావు. నిపుణుల సలహాలు తీసుకుని ముందుకువెళ్లాలన్నారు. బాధితుల బాధతలను దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి సహాయక చర్యలు జరుగుతున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వచ్చేందుకు సమయం దొరకడం లేదా అంటూ ప్రశ్నించారు. కానీ ఎన్నికల ప్రచారానికి మాత్రం వెళ్లారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వచ్చిన 14 నెలల్లో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని హరీశ్‌రావు ఆరోపించారు. ఇప్పటికైనా శిథిలాల తొలగింపు పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
సహాయక చర్యల్లో పాల్గొంటున్న వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం చేయలేదని హరీశ్‌రావు ఆరోపించారు. స్పష్టమైన డైరెక్షన్ లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. మంత్రులు రోజూ వస్తున్నారు.. పోతున్నారు..ఇదేమైనా టూరిస్ట్ ప్రాంతమా..? ఇప్పటికీ కన్వేయర్ బెల్డ్ పనిచేయడం లేదని అన్నారు. 6 రోజుల తర్వాత తట్టెడు మట్టిని బయటకు తెచ్చారని మండిపడ్డారు. కానీ గడిచిన 6 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు శూన్యమని అన్నారాయన. ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.
ఇంకా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ” 8 మంది ప్రాణాలపై మీకున్న చిత్తశుద్ధి ఇదేనా..? మమ్మల్ని టన్నెల్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టన్నెల్ కూలిపోయిందని ఆరోపిస్తున్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలగవద్దనే.. ఇన్ని రోజులు ఇక్కడికి రాలేదు. 6 రోజుల తర్వాత కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. మమ్మల్ని ఇక్కడకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేం వచ్చామని బాధిత కుటుంబాలను దాచిపెట్టారు”… అని హరీశ్‌రావు అన్నారు.
అంతకుముందు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు బీఆర్ఎస్ బృందం వచ్చింది. తొలుత వారిని వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. టన్నెల్ వద్ద సహాయక కార్యక్రమాలు జరుగుతన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు యత్నించారు. ఈ క్రమంలో చెక్‌పోస్ట్ వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నిరంజీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.