26.6 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

Basara IIIT: ట్రిపుల్ ఐటీలో కలవరపెడుతున్న వరుస ఆత్మహత్యలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఐఐటీ, ట్రిపుల్ ఐటీల్లో(BASARA IIIT) విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీలో మొన్న జరిగిన విద్యార్థిని మృతి ఘటన మరువక ముందే ఈ రోజు పీయూసీ – 1 విద్యార్థి జాదవ్ బబ్లూ (BABLU) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. వెంటనే సిబ్బంది భైంసాలోని ఏరియా ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే చనిపోయాడని వైద్యులు తేల్చారు. ఇక అక్కడి నుండి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ట్రిపుల్ ఐటీలో పీయూసీ (PUC )చదువుతున్న విద్యార్థిని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన బబ్లూ అని గుర్తించారు.

వరుస ఆత్మహత్యలు జరుగుతున్నా ముందస్తు జాగ్రతలపై అధికారులు దృష్టిపెట్టడం లేదని తెలుస్తోంది. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వారికి కౌన్సిలింగ్‌ (Counselling)నిర్వహిస్తున్నారే తప్ప ఇతర చర్యల గురించి పట్టించుకోవడం లేదు.  వారానికి ఓ‌ సారి విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించడం, ఒత్తిడికి గురి కాకుండా కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేపట్టాలి విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో డిమాండ్ వ్యక్తం చేశారు‌ కూడా. కానీ అవేమీ అమలు కాకపోవడంతో ట్రిపుల్ ఐటీ లో వరుస మరణాలు‌ చోటు చేసుకుంటున్నాయి.

ఇక అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు క్యాంపస్‌లో 30 పడకల ఆస్పత్రి ఉన్నా వైద్యుల కొరత.. మెడిసిన్ , అత్యాధునిక వైద్య పరికరాల కొరత విద్యార్థుల ప్రాణాలను గాల్లో కలిపేస్తుందని తెలుస్తోంది. 9 వేల మంది చదువుతున్న విద్యాలయంలో ఉన్న ఆస్పత్రిలో కేవలం నలుగురు వైద్యులు మాత్రమే ఉండటం.. అత్యవసరమైన ఆక్సిజన్ కూడా అందుబాటులో లేకపోవడం వేధిస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్