స్వతంత్ర వెబ్ డెస్క్: ఆర్మూర్ బీఆర్ఎస్ ఎన్నికల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. కేటీఆర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి.ప్రచార రథంపై ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఓపెన్ టాప్ వ్యాన్ రెయిలింగ్ ఒక్కసారిగా పడిపోయింది. ముందుగా ఉన్న వాహనాలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో కేటీఆర్, జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డిలకు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. ఆర్మూర్ లో ఎన్నికల ప్రచారంలో అకస్మాత్తుగా ప్రచార రథం గ్రిల్ ఊడిపోయింది. దీంతో ప్రచార రతంలో ఉన్న జీవన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి వాహనం నుంచి కింద పడిపోయారు. దీంతో వారికి గాయాలు కొంచెం ఎక్కువగా తగిలాయి. మంత్రి కేటీఆర్ ని గన్ మెన్ పట్టుకోవడంతో కాస్త ప్రమాదం తప్పింది. లేకుంటే కేటీఆర్ కూడా కిందపడి ప్రమాదం జరిగి ఉండేది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ కార్యక్రమం అనంతరం కొడంగల్ లో రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు కేటీఆర్.తన ఆరోగ్య పరిస్థితి పైన ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు కేటీఆర్.
ఆర్మూర్ లో అపశ్రుతి… మంత్రి కేటీఆర్ కి స్వల్ప గాయాలు
0
370
Latest Articles
ఏలూరులో ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ… రూ.కోటి అపహరణ… థార్ గ్యాంగ్ పనేనా?
ఏలూరు భారీ దోపిడీ జరిగింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దోపిడీ జరిగింది. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ లో రికార్డ్ అయిన సీసీటీవీలో ఫుటేజ్‌లో థార్...
- Advertisement -
- Advertisement -


