స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ డ్యాన్స్ ప్రోగ్రాం ‘ఢీ’ షో ద్వారా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం నెల్లూరు క్లబ్ హోటల్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్ కు ముందు తనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని.. వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అప్పులోళ్ల బాధ తట్టుకోలేకపోతున్నానని.. ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదని వాపోయాడు. అర్థాంతరంగా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నందుకు తల్లిదండ్రులు, తోటి డ్యాన్స్ మాస్టర్లు, డ్యాన్సర్లకు క్షమాపణలు చెప్పాడు. చైతన్య సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Breaking: ‘ఢీ’ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ ఆత్మహత్య
0
298
Previous article
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


