డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి. కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్న తమ పై సొంత పార్టీ నేతలే రాజకీయ కక్ష కట్టి వేధించారని హస్తం నేతలపై మండిపడ్డారు కార్తీక్‌రెడ్డి. 2004 నుంచి 2009 వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించే వరకు వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని గుర్తు చేసిన ఆయన.. వారి మరణానంతరం సొంత పార్టీ నేతలే సబితాపై సీబీఐ కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాము పార్టీని వెళ్లేదని.. కాల క్రమేణా తమ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులే రాజకీయంగా సమాధి చేయాలన్న ఉద్దేశంతో పీకమీద తొక్కిపెట్టి నొక్కుతుంటే తప్పని పరిస్థితుల్లో పార్టీ మరాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు కార్తీక్‌రెడ్డి. చరిత్ర ఏంటో, సత్యం ఏంటో…? తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని భట్టిపై మండిపడ్డారు.