ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఒక పక్క లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. డిపీసీసీ చీఫ్ షాక్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ ను నిరంతరం విమర్శించే ఆమ్ ఆద్మీపార్టీలో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఢిల్లీ కాంగ్రెస్ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకోవడానికి నిరసనగా లవ్లీ రాజీనామా చేశారు. కాంగ్రెస్ జాతీ య అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా పంపారు. తాను ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవిలో కొనసాగలేనని అరవింద్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో పార్టీ అభ్యర్థుల ఎంపిక తీరుపట్ల లవ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ కోసం ఏళ్లుగా కృషి చేసిన వారిని కాదని, ఢిల్లీ కాంగ్రెస్ తో సంబంధం లేని కొత్తవారు కన్హయ్య కుమార్ కు నార్త్ ఈస్ట్ ఢిల్లీ సీటు, ఉదిత్ రాజ్ కు వాయవ్య ఢిల్లీ సీటు కేటాయించడాన్ని కూడా అరవింద్ సింగ్ లవ్లీ తప్పు పట్టారు. కేవలం కాంగ్రెస్ పై తప్పుడు,, దురుద్దేశపూర్వక అవినీతి ఆరోపణలు చేస్తూ ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ వ్యతిరేకమని అర్విందర్ సింగ్ లవ్లీ తెలిపారు.
ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ రాజీనామా
0
236
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


