వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 42 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, మొత్తం 18, 24, 466 ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,900 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు అధికారులు. 12వేల 710 మందికి పోస్టల్ బ్యాలెట్ అందించగా 9వేల 544 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించు కున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటి నుండి 1,155 మందిని బైండోవర్ చేశారు పోలీసులు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద 5 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. నియోజకవర్గంలో రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. మిగతా 6 నియోజక వర్గంల్లో స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, వర్దన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మహ బూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు.మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 15,32,366 ఓటర్లు ఉన్నారు. మహబూబాబాద్‌లో 335 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 839 గుర్తించారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
0
291
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


