మహిళల కోసం బస్సు ఆపని డ్రైవర్‌ సస్పెండ్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మండుటెండలో బస్సు కోసం వేచిచూస్తోన్న మహిళల పట్ల ఆ డ్రైవర్ వివిక్ష చూపించిన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ఓ బస్‌ స్టాప్‌లో ముగ్గురు మహిళలు ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో వారు ఎక్కాల్సిన బస్సు అక్కడికి వచ్చింది. అయితే డ్రైవర్ ఓ ప్రయాణికుడిని దింపేసి బస్సు ముందుకు పోనిచ్చాడు. మహిళలు పరిగెత్తుతున్నా అతను మాత్రం ఆపకుండానే వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేజ్రీవాల్ డ్రైవర్‌ను సస్పెండ్‌ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియోను కేజ్రీవాల్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ మహిళా ప్రయాణికుల కోసం బస్సు ఆపని డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Latest Articles

క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్‌ చేస్తున్నారు- స్పీకర్‌

అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్