సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. పాచి కల్లు తాగిన వాళ్లలాగా యాదగిరిగుట్టలో కేసీఆర్‌పై మాట్లాడారని మండిపడ్డారు. ఆయన వయసుకు గౌరవం ఇవ్వకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహించారు. రేవంత్‌రెడ్డికి రాహుల్ గాంధీ బర్త్‌డే విషెస్ చెప్పలేదన్న బాధలో ఏం మాట్లాడారో ఆయనకే తెలియడంలేదన్నారు. సీఎం పదవి పోతుందన్న ఫ్రస్టేషన్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు. జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ అభివృద్ధి చేయవద్దని కేటీఆర్, హరీష్ ఎప్పుడైనా అన్నారా అని నిలదీశారు. మూసీ అభివృద్ధి పేరుతో జీవన విధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులపై దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు
0
142
Previous article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


