స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమల ఘాట్ రోడ్లలో గత నెలలో వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల టీటీడీ దృష్టి సారించింది. ఈ విషయం మీద టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనిపై ధర్మ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఘాట్ రోడ్లపై ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే డేంజర్ జోన్లను గుర్తించి, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. తిరుమల ఘాట్ రోడ్లపై ఎక్కడ ప్రమాదం జరిగినా సత్వరమే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు ఇక యాక్షన్ టీమ్ సిద్ధంగా ఉండాలని ధర్మారెడ్డి సూచించారు. అంతేకాకుండా, తిరుమలలోని వివిధ ప్రాంతాలకు భక్తులను చేరవేసే ధర్మ రథం బస్సులను రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో తిప్పాలని అధికారులకు నిర్దేశించారు.
ఘాట్ రోడ్లలో డేంజర్ జోన్ల గుర్తింపునకు టీటీడీ చర్యలు
0
306
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


