37.2 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

దళిత బంధు రెండో విడతను విడుదల చేయాలి – కౌశిక్‌రెడ్డి

హుజూరాబాద్‌లో దళిత బంధు రెండో విడతను వెంటనే విడుదల చేయాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అంతవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా దళిత కుటుంబాలకు 12 లక్షలు విడుదల చేయాలన్నారు. లేదంటే హస్తం నాయకులను నియోజకవర్గంలో తిరగనివ్వబోమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దమ్ముంటే హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితకాలనీల్లో పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు కౌశిక్‌రెడ్డి.

అంతకుముందు.. తన నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత రాని వాళ్లు తనకు దరఖాస్తు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి. అప్లికేషన్లు ఇచ్చేందుకు వచ్చిన వారితో కలిసి అంబేడ్కర్‌ చౌరస్తాకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కౌశిక్‌రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో.. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్