దళిత బంధు పథకం కేవలం ఓట్ల కోసమే – కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్‌..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఓట్ల కోసమే కేసీఆర్‌(KCR) దళిత బంధు(Dalit Bandhu) తెచ్చారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(MP Komatireddy Venkat Reddy) విమర్శలు గుప్పించారు. నార్కట్‌పల్లి(Narkatpally) మండలం ఎల్లారెడ్డి గూడెంలో(Ellareddy Goodem) ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… దళిత బంధు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇస్తున్నారని, బీసీ బంధు(BC Bandhu) కూడా ఎన్నికల తర్వాత మాయం అవుతుందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్లపై ఉన్నారన్న ఆయన కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేశాడని దుయ్యబట్టారు.

‘‘బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కోమటిరెడ్డికి పేరు వస్తుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పనులు చేయడం లేదు. సిద్దిపేటలో లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేసి నన్ను 10 సంవత్సరాలుగా ఏడిపిస్తవా. మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని గ్రామాలకు సాగు నీళ్లు ఇస్తా. కుటుంబ పాలన పోతేనే పేదలు, నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయి. కేసీఆర్ దళిత బంధు పథకం ఓట్ల కోసమే తెచ్చారు. దళిత బంధు పేరుతో రూ.10 లక్షల ఇస్తే అందులో 3 లక్షలు కమిషన్ తీసుకుంటున్నారు’’ అని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్