తిరుమల కొండపై పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శన టోకెన్ల జారీ రద్దు చేసిన టీటీడీ

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమలకు గత కొన్నిరోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు అన్నీ నిండిపోయి, భక్తులు శిలా తోరణం వరకు వేచి ఉన్నారు. మరి కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో, స్వామివారి సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

పురటాసి శనివారాలకు తోడు, కొన్ని సెలవులు కూడా కలిసి రావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని టీటీడీ వెల్లడించింది. దాంతో, ప్రతి రోజూ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్ల జారీ అక్టోబరు 1, 7, 8, 14, 15 తేదీల్లో రద్దు చేస్తున్నామని పేర్కొంది. భక్తులు ఈ మార్పును గమనించి, తమకు సహకరించాలని టీటీడీ తన ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్