తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 68 వేల 446 మంది దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లుగా నమోదు అయింది.అటు వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం భారీ సంఖ్యలో భక్తులు తరలిరా నున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఉచిత సమయ నిర్దేశిత సర్వదర్శనం, రూ.300 ప్రత్యేకప్రవేశ దర్శనం టికెట్ల కోటాను పెంచేందుకు చర్యలు తీసుకుంటా మని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. వేసవి రద్దీ నేపథ్యంలో వీఐపీలకు, శ్రీవాణి, టూరిజం, వర్చువల్ సేవ లకు కేటాయించే టికెట్లను తగ్గించి ఎస్‌ఎస్‌డీ, ఎస్‌ఈడీ టికెట్ల కోటా పెంచు తామని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
0
362
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


