30.7 C
Hyderabad
Friday, June 9, 2023

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్యకేసు… పోలీసుల దర్యాప్తులో భయంకర నిజాలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్ళపాడు గ్రామానికి చెందిన రాధ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాయంత్రం ఇంటినుండి వెళ్లిన రాధ.. తెల్లారేసరికి శవమై తేలింది. రాధ మృతదేహాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న రాధ.. ఇటీవల వెలిగండ్లలో జరిగిన చౌడేశ్వరమ్మ తిరునాళ్లకు హైదరాబాద్ నుండి స్వగ్రామమైన జిల్లెళ్ళపాడుకు వచ్చింది. ఈనెల 17వ తేదీన కనిగిరిలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్ళింది. అయితే అదేరోజు సాయంత్రం రాధకు ఓ వ్యక్తి నుండి వచ్చిన ఫోన్ కాల్ తో ఆమె ఇంట్లో నుండి బయటికి వెళ్ళింది.

రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రాధ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా జిల్లెళ్ళపాడు క్రాస్ రోడ్డు వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే లొకేషన్ కు వెళ్లిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్ తగింలింది. రోడ్డు పక్కనే పడి ఉన్న రాధ మృతదేహాన్ని చూసి పోలీసులు ఖంగుతిన్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రాధ స్నేహితుడు కాశిరెడ్డి బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ పెడుతున్నానని చెప్పి ఆమె వద్ద రూ. 70 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. తిరిగి డబ్బులు ఇచ్చే విషయంలో వివాదం తలెత్తినట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కాశి రెడ్డి ఫోన్ చేసి.. రాధను ఒంటరిగా బయటికి తీసుకెళ్లి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వివరాలు చేర్చారు.

తొలుత మిసింగ్ కేసుగా భావించి కేసు దర్యాప్తును మొదలు పెట్టిన పోలీసులు.. ఆతరువాత హత్య కేసుగా తెలుసుకున్నారు. కనిగిరిలో ఉన్న పలు సీసీ కెమెరాల రికార్డ్ లను పరిశీలించారు. ప్రభుత్వ హాస్పెటల్ సెంటర్ లో రాధ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను ఓ సీసీ కెమెరాలో గమనించారు. ఆ సమయంలోనే ఓ ఎర్ర రంగు కారు వచ్చి రాధ పక్కనే ఆగింది. కారులో ఉన్న వారిని చూసి ఆమె రెండు అడుగులు వెనక్కి వేసింది. తరువాత కారు వెళ్ళిపోయింది. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినా ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.

అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రాధని కారులో తీసుకెళ్లి నిర్జల ప్రదేశంలో ఆమెను కారుతో తొక్కించినట్టుగా పోలీసులు అనుమానించారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత జిల్లెళ్ళపాడు క్రాస్ రోడ్డు వద్ద మృతదేహాన్ని పడేసివెళ్లినట్లు పోలీసులు భావించారు. అయితే తొలుత రాధ అప్పు ఇచ్చిన కాశిరెడ్డి గాని.. అతనికి సంభందించిన వాళ్లు గాని ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావించారు. ఆ కోణంలో విచారణ సాగించారు. అయితే ఈ కోణంలో పెద్దగా క్లారిటీ కనిపించలేదు. దీంతో మరిన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఎవరు ఊహించని కోణాన్ని పోలీసులు పసిగట్టారు. దీంతో రాధ కుటుంబ సభ్యులు కూడా షాక్ కు గురయ్యారు.

రాధను ఆమె భర్తే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాధ హత్య కేసు దర్యాప్తులో భాగంగా నల్గొండ జిల్లా కోదాడకు చెందిన ఆమె భర్త మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోని ప్రశ్నించారు. అవసరమైన వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ దర్యాప్తులో రాధ తల్లిదండ్రులు కూడా చెప్పని పలు వివరాలను పోలీసులు కనిపెట్టారు. రాధ భర్త మోహన్ రెడ్డికి ఆమె హత్యకు సంభందించిన సమాచారం ఇచ్చే క్రమంలో అతని సెల్ నెంబర్ ను పోలీసులు రాబట్టారు. రాధ హత్య జరిగిన సమయంలో తాను హైదరాబాద్ లో ఉన్నట్లు మోహన్ రెడ్డి బదులిచ్చారు. అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ పరిశీలించిన పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. రాధ హత్య సమయంలో మోహన్ రెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్స్ హైదరాబాద్ లో కాకుండా హత్య జరిగిన ప్రాంతంలో చూపించాయి.

రాధ భర్తను అనుమానించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారించారు. ఈ క్రమంలో అనేక వివరాలు రాబట్టారు. ఈ దంపతులకు సంభందించిన ఓ భూమిని అమ్మగా.. రూ. 80 లక్షలు వచ్చాయి. ఆ డబ్బులను రాధ తన ఫ్రెండ్ తో పాటు తన మామయ్యకు అప్పుగా ఇచ్చింది. అలాగే షేర్ మార్కెట్ లో చాలా వరకు పెట్టుబడులు పెట్టి నష్టపోయింది. దీంతో దంపతుల మధ్య ఆర్థిక అంశాల్లో అభిప్రాయ బేధాలు తలెత్తారు. దీంతో మోహన్ రెడ్డి, రాధ దంపతులు విడాకులు తీసుకోవాలని ఇద్దరు ఓ అంగీకారానికి వచ్చారు. ఈ విషయాన్ని ఇటీవల కుటుంబ సబ్యులకు, బంధుమిత్రులకు కూడా చెప్పి ఒప్పించారని పోలీసులు తెలుసుకున్నారు. అయితే ఆ తరువాత రాధ విషయంలో మాట మార్చినట్లు చెబుతున్నారు. తనకు పరిహారంగా రూ. 10 లక్షలు ఇస్తేనే విడాకుల పత్రంపై సంతకాలు చేస్తానని రాధ తన భర్త మోహన్ రెడ్డికి స్పష్టం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయిందంటున్నారు.

రాధ ఎదురు తిరగటంతో విచక్షణ కోల్పోయిన ఆమె భర్త మోహన్ రెడ్డి పక్క ప్లాన్ తో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎవరికి అనుమానం రాకుండా తన కారు కాకుండా వేరే కారు తీసుకొని ప్రకాశం జిల్లాకు వెళ్ళాడు మోహన్ రెడ్డి. ఒంగోలులో నకిలీ నెంబర్ ప్లేట్ తగిలించుకున్నారు. తన సెల్ నెంబర్ తో కాకుండా వేరే సెల్ నెంబర్ తీసుకొని రాధకు కాల్ చేశాడు. కనిగిరిలో ఆమెను కారులో ఎక్కించుకొని జిల్లెల్లపాడుకు తీసుకెళ్లాడు. కారులోని చున్నీతో గుంతును బిగించి చంపేశాడు. ఆ తరువాత రోడ్డు మీద మృతదేహాన్ని పడేసి వెళ్ళిపోయాడు. ఆ రూట్ లో వెళ్లిన వేరే వాహనం రాధ మీదుగా వెళ్ళింది. దీంతో రోడ్డు ప్రమాదంలో రాధ చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేశాడు మోహన్ రెడ్డి. మొత్తానికి పోలీసుల సునిశిత దర్యాప్తు, సాంకేతిక ఆధారాలు రాధ హత్యకేసు మిస్టరీని ఛేదించాయి.

Latest Articles

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్