25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

చట్ట సభల్లో నేరగాళ్ళ ఎంట్రీకి ఫుల్ స్టాప్ ఎప్పుడు ?

    ప్రజాస్వామ్యానికి పునాదిగా చెప్పుకునే ఎన్నికల్లో నేరగాళ్లు ప్రవేశించి చాలా కాలమైంది. ఈపరిణామాన్నే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్‌ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 1980 లోక్‌సభ ఎన్నికల సందర్భంలో దీనికి పునాది పడింది. కాంగ్రెస్ ప్రారంభించిన ఈ దుర్మార్గపు ట్రెండ్‌ను ఆ తరువాత మిగతా పార్టీలు ఒంటబట్టించుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై కొన్ని వేల కేసులున్నాయి. అయితే ఈ కేసుల పై విచారణ జరపడానికి ఉన్న కోర్టులు సరిపోవడం లేదు. వేలాది కేసులను ఏడాదిలోపు తేల్చేయడానికి ప్రస్తుతం ఏర్పాటు చేసిన కోర్టులు సరిపోవు. దీనిపై సుప్రీంకోర్టు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించడానికి కోర్టుల సంఖ్య పెంచాలి. అయితే ఇది అనుకున్నంత ఈజీ కాదు. వివిధ రాష్ట్రాల హై కోర్టులు, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ నేతలపై ఉన్న కేసులను ఏడాదిలోగా తేల్చేయడానికి ఒక సమగ్ర ప్రణాళికతతో ముందుకు పోవాల్సి ఉంటుంది.

     రాజకీయాలు నేరగాళ్లు ప్రవేశించి చాలాకాలమైంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలలోకి క్రిమినల్స్ ఎంట్రీ ఇచ్చారు. ప్రధానంగా 1980 లోక్‌సభ ఎన్నికల నుంచి ఈ దుర్మార్గపు ట్రెండ్ ప్రారంభ మైందని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో సైద్దాంతిక పోరాటాలు తగ్గిపోయాయి. ప్రత్యర్థులను దెబ్బతీయడా నికి రాజకీయ పార్టీలు అసాంఘిక శక్తుల సాయం తీసుకోవడం మొదలైంది. అప్పటివరకు రాజకీయ నాయకుల ప్రాపకంతో అసాంఘిక శక్తులు బతికేవి.కాలక్రమంలో మజిల్ పవర్‌కు రాజకీయాల్లో ప్రాధాన్యం పెరిగింది. ఒకదశలో అసాంఘిక శక్తులే రాజకీయ నాయకుల అవతారం ఎత్తడం మొదలె ట్టారు. దీంతో వీరికి రాజకీయ పార్టీలు కూడా టికెట్లు ఇచ్చే దుర్మార్గపు కల్చర్ మొదలైంది. ఇంకే ముంది. పవిత్రమైన లోక్‌సభలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించడానికి మార్గం సుగమం అయింది. ఒకటని కాదు. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఈ కల్చర్‌ను అనుసరించాయి. దీంతో రాజకీయాల్లో అసాంఘిక శక్తుల ప్రాధాన్యం పెరిగింది.

   ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసుల వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఉంచాలని 2020లో సుప్రీంకోర్టు అన్ని పార్టీలనూ ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అన్ని పార్టీలు పాటించడం లేదు. అఫిడవిట్‌లో అరకొర వివరాలు ఇస్తూ ఎన్నికల కమిషన్‌ను మభ్య పెడుతున్నా యన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు. కొంతమంది అభ్యర్థులైతే తమపై నమోదైన కేసు వివరాలను టాంపరింగ్ కూడా చేస్తున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు తమ పలుకుబడిని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తమ మీద నమోదైన కేసులను ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇప్పించు కుంటున్నాయి. హైకోర్టు అనుమతి లేకుండా కేసులను ఉపసంహరించరాదని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు కూడా అమలుకు నోచుకోవడంలేదు.

   ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను గురించి తెలుసుకోవడానికి పర్యవే క్షణ కమిటీ ఏర్పాటు చేయాలని 2018లో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకూ ఈ కమిటీ ఏర్పాటు కాలేదు. దీనికి పాలకులకు చిత్తశుద్ది లేకపోవడమే కారణం. క్రిమిన లైజేషన్ ఆఫ్ పాలిటిక్స్‌ను అన్ని రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇందులో ప్రధాన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీదే. నేర రహిత రాజకీయ వ్యవస్థ అమలు చేయాలన్న చిత్తశుద్ది అధికార పార్టీకి ఉండాలి. ఇదిలా ఉంటే, చట్టసభల్లో నేరస్తులను అడ్డు కునే విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు, ఆదేశాలను అలాగే సుప్రీంకోర్టు సూచనలు నూటికి నూరుశాతం అమల య్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు రాజకీయ పండి తులు. కొన్ని దశాబ్దాలుగా రాజకీయ పార్టీలకు గెలుపు గుర్రాలే ముఖ్యమవుతున్నాయి. అయితే సదరు గెలుపు గుర్రానికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా పట్టించుకునే పరిస్థితిలో రాజకీయ పార్టీలు లేవు. ప్రజా స్వామ్యంలో ఇది ఒక దుర దృష్టకర పరిణామం. కేవలం ఎన్నికల్లో గెలవడం, అధికారంలోకి రావడమే రాజకీయ పార్టీలకు పరమా వధిగా మారింది. నేరచరితులకు, రకరకాల కుంభకోణాల్లో చిక్కు కున్న వారికి, టికెట్లు ఇచ్చి బరిలో నిలుపుతున్నాయి రాజకీయ పార్టీలు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా మారింది.

     రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో డబుల్ స్టాండర్డ్స్‌తో వ్యవహరిస్తున్నాయి. పైకి రాజకీయాల్లో నేరస్తుల ప్రవేశాన్ని తప్పుపడుతున్నాయి. అయితే నేర చరిత్ర లేని వారికే టికెట్లు ఇస్తామని గట్టిగా చెప్పే ధైర్యం చేయడం లేదు. దీంతో రాజకీయాల్లో నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. తమది భిన్న రాజకీయ సంస్కృతి అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 2022 ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 403 మంది అభ్యర్థుల్లో 205 మందిపై క్రిమినల్ కేసులు న్నాయి. వీరిలో 39శాతం మందిపై హత్య, అల్లర్లు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వంటి తీవ్రమైన కేసులు న్నాయి. అంతేకాదు ఈ 205 మందిలో ఎక్కువ మంది బీజేపీ తరఫున గెలిచిన వారే కావడం విశేషం. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. భారతదేశ రాజకీయాల డైనమిక్స్ కొంత కాలంగా మారుతోంది. ఒకప్పుడు రాజకీయాల్లో ప్రవేశించిన నేరగాళ్లు చాలా సైలెంట్‌గా ఉండేవారు. తమ నేరమయ జీవితం గురించి ప్రస్తావించడానికి సిగ్గుపడేవారు.అయితే కొంతకాలంగా నేరగాళ్ల వైఖరిలో మార్పు వచ్చింది. రాజకీయ నాయకులు తమపై ఉన్న క్రిమినల్‌ కేసుల గురించి గొప్పగా చెప్పుకోవడం ప్రారంభమైంది. నేరగాళ్లను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవడంలో ఎన్నికల సంఘం పాత్ర బలహీనం గా ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నేరరహిత రాజకీయాలకు పొలిటికల్ పార్టీలు ముందుకు రావాలి. రాజకీయాల్లో నేరగాళ్లకు కళ్లెం వేసే దిశగా రాజకీయ పార్టీలు అడుగులు వేయాలి. అప్పుడే చట్ట సభల్లో నేరగాళ్ల ఎంట్రీకి ఫుల్ స్టాప్ పడుతుందంటున్నారు రాజకీయ పండితులు.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్