25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

అమేధీ గోదాలో రాహుల్!

   కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మళ్ళీ మరోసారి అమేధీ నుంచి పోటీ చేస్తారా.. రాహుల్ పోటీ చేసి తీరాలని కాంగ్రెస్ వ్యూహకర్తలు కోరుతున్నారు. రాజ్యసభకు ఎన్నికైన కారణంగా సోనియాగాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. రాహుల్ అమేధీ నుంచి పోటీ చేస్తే.. కాంగ్రెస్ – సమాజ్ వాదీ పార్టీ కూటమి అభ్యర్థులకు కొత్త స్ఫూర్తి లభిస్తుందని, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు రెట్టింపు ఉత్సాహంతో దూసుకు వెళ్లగలరని కాంగ్రెస్ వ్యూహకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  రాయ్ బరేలీ, అమేధీ కొన్ని దశాబ్దాలుగా నెహ్రూ- గాంధీ కుటుంబానికి అడ్డా. ఒకప్పుడు ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత తరంలో సోనియాగాంధీ, రాహుల్ ఈ స్థానాల నుంచి పోటీ చేస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ 2004 నుంచి అమేధీకి లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 2019లో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడి పోయారు. రాహుల్ కేరళ వయినాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లోనూ వయినాడ్ లో రాహుల్ పోటీ చేశారు. ఈ నేపథ్యంలో రాయ్ బరేలీ, అమేధీ నుంచి కాంగ్రెస్ తరుపున ఎవరు పోటీ చేస్తారన్నది సస్పెన్స్. ప్రియాంక గాంధీ వద్రా, ఆమె భర్త రాబర్ట్ వద్రా పోటీ చేస్తారనే పుకార్లు ప్రచారం లో ఉన్నా.. యూపీ లోని అమేధీ నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు, వ్యూహకర్తలు కోరుతున్నారు.

 రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ రాయ్ బరేలీ, అమేధీలో ఎవరు పోటీ చేస్తారనే అంశంలో ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు. పొత్తులో భాగంగా సమాజ్ వాదీ పార్టీ ఆ రెండు స్థానాలతో పాటు 17 స్థానాలను కాంగ్రెస్ కే కేటాయించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఎస్పీ  సీట్లు పంచుకుని ఐక్యంగా బీజేపీని ఎదుర్కొంటున్నాయి.

  సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ సమైక్యం గా పోటీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీకి దీటైన పోటీ ఇచ్చి కాషాయ దళాన్ని చిత్తు చేయవచ్చని ఆశిస్తున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అమేధీ పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో లభించిన ఓట్ల గణాంకాలు.. కాంగ్రెస్, ఎస్పీ కి చాలా అనుకూలంగా ఉన్నాయి. అమేధీ పార్లమెంటరీ నియోజకవర్గం లోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు… తిలోయ్, సాలోన్, జగ్దీష్ పూర్, గౌరి గంజ్, అమేధీతో మొత్తం కలిసి బీజేపీకి 4 లక్షల 18 వేల 700 ఓట్లు రాగా, ఈ ఐదు సెగ్మెంట్లలో కలిపి ఎస్పీకి 3 లక్షల 52 వేల 475 ఓట్లు, కాంగ్రెస్ కు లక్షా 42 వేల పైగా ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ కన్నా ఈ రెండు పార్టీలకు కలిపి 23 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 2022లో అమేధీ ఎంపీలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ లలో మూడింటిలో బీజేపీ, రెండింటిలో ఎస్పీ గెలిచింది. ఎస్పీ, కాంగ్రెస్ కూటమి సమైక్యంగా పోటీ చేయడంతో పైచేయి సాధించే అవకాశం ఉంది. 2022 లో కాంగ్రెస్ -ఎస్పీకి వచ్చిన ఓట్లు కలిపి చూస్తే, కనీసం నాలుగు అసెంబ్లీ స్థానాలను ఈ కూటమి గెలిచి ఉండేది. ఈ సారి రెండు పార్టీలు ఎంపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నందువల్ల కూటమి పైచేయి సాధించే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు.

    అమేధీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, ఇంకా టైమ్ ఉంది. అమేధీ నియోజకవర్గానికి మే 20న ఐదో విడతలో పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 26న నోటిఫికేషన్ విడుద లవుతుంది. మే 3 వరకూ నామనేషన్ దాఖలుకు గడువు ఉంది. కేరళలోని వయినాడ్ లో రాహుల్ గాంధీ ఇప్పటికే పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 26 న ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల ఎలాంటి అడ్డంకులు లేవు. వయినాడ్ లో రాహుల్ గాంధీ సిపిఐ అభ్యర్థి అన్ని రాజా తోనూ, బీజేపీ కేరళ రాష్ట్ర శాఖ చీఫ్ సురేంద్రన్ వంటి బలమైన ప్రత్యర్థులతో పోటీ పడుతున్నారు. రాహుల్ విజయవకాశాలు మెండుగా ఉన్నా వయినాడ్ లో రాహుల్”వెలుపలి వ్యక్తి” అనే ప్రచారం ఉంది. అందువల్ల అమేధీలో పోటీ చేయడం రాహుల్ కు ఎంతైనా అడ్వాంటేజ్ గా ఉంటుందనే విశ్లేషకు లు భావిస్తున్నారు.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్