25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

తెలంగాణలో రైతు మాఫీపై డైలాగ్ వార్

తెలంగాణ రాజకీయాల్లో రుణ మాఫీ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధానంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ అగ్రనేత తన్నీరు హరీశ్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇద్దరూ ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకున్నారు. నాలుగు నెలల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, రైతు బంధు పథకాన్ని పక్కన పెట్టిందని బీఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్‌ రావు మండిపడ్డారు. ఎక్కడైనా ఇచ్చినా అరకొరేనని ఆయన వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుల సంక్షేమానికి సంబంధించి ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోలేకపో యిందని నిప్పులు చెరిగారు హరీశ్ రావు. ప్రధానంగా రుణమాఫీపై ఘాటు విమర్శలు చేశారు హరీశ్ రావు. రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు ఆయన.

హరీశ్‌రావు సవాల్‌కు దీటుగా బదులిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆగస్టు 15వ తేదీలోగా తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే భారత్ రాష్ట్ర సమితిని రద్దు చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. ఆలంపూర్ జోగులాంబ మాత, హనుమాన్‌ భగవాన్ సాక్షిగా చెబుతున్నా…ఆగస్టు 15వ తేదీలోగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.భూమి, ఆకాశం తలకిందులైనా రుణమాఫీపై వెనక్కి తగ్గేది లేదన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉరేసుకున్నా, రుణ మాఫీ ఆగేదిలేదన్నారు. రేవంత్ రెడ్డి అంతటితో ఆగలేదు. ఈ సందర్బంగా గులాబీ పార్టీ పై ఆయన నిప్పులు చెరిగారు.తెలంగాణను పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్‌, సంక్షేమానికి సంబంధించి లెక్కకు మించిన హామీలు ఇచ్చారన్నారు. అయితే ఈ హమీలను కేసీఆర్ అమలు చేసిన పాపాన పోలేదన్నారు. అంతేకాదు…మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చివేశారని ఘాటు విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోగా పడిపోతుందని కేసీఆర్ జోస్యం చెప్పడంపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. తన ప్రభుత్వం పడగొట్టడానికి బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని ఆయన ఆరోపించారు. పైకి విమర్శ లు చేసుకుంటున్న బీఆర్‌ఎస్, బీజేపీలు లోపాయికారీగా కుమ్మక్కు అయ్యాయని రేవంత్ ఘాటు ఆరోపణలు చేశారు. అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ ఏడాదిలోగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుం దని జోస్యం చెప్పారు. అంతేకాదు సాక్షాత్తూ రేవంత్ రెడ్డే బీజేపీలో చేరతారని కేసీఆర్ జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు జై కొడుతున్న రేవంత్, ఢిల్లీలో బీజేపీకి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు కేసీఆర్. ఇదిలా ఉంటే తెలంగాణలో రుణమాఫీ అంశం కాంగ్రెస్ అగ్రనాయకత్వం దృష్టికి కూడా వెళ్లింది. రుణమాఫీ అంశం తీవ్రతను రాహుల్‌ గాంధీ కూడా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు నెలలైనా, రుణమాఫీ వంటి కీలక అంశంపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని రేవంత్‌ రెడ్డిపై రాహుల్ కూడా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే భారత్ రాష్ట్ర సమితి నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారు హరీశ్ రావు. అయితే ఏకకాలంలో రూ. 39 వేల కోట్ల రుణ మాఫీ చేసే ఆర్థిక పరిస్థితి కాంగ్రెస్ సర్కార్‌కు ఉందా ? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

   ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పడం ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడమేనని బీఆర్ఎస్ నేత వ్యాఖ్యానించారు. గడువులోగా రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయడానికి రేవంత్ రెడ్డి సిద్దంగా ఉన్నారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటినా, ఇంతవరకు రుణమాఫీ సహా ఇతర హామీలను ఎందుకు నెరవేర్చలేదని సూటిగా ప్రశ్నించారు హరీశ్ రావు. ప్రమాణస్వీకారం అనంతరమే రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని హరీశ్ రావు ప్రశ్నిచారు. పనిలోపనిగా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తరువాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఘాటు ఆరోపణలు చేశారాయన. మొత్తానికి రుణమాఫీ అంశం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అధికారపక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ మధ్య యుద్ధానికి దారి తీసింది. రెండు పార్టీలకు చెందిన నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. తెలంగాణ రాజకీయాలను గరంగరం చేశారు.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్