పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్, అధికార యంత్రాంగామే బాధ్యత వహించాలని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. ఏపీలో లక్ష 25వేల మందికి పైగా సచివాలయ సిబ్బంది ఉండగా… 66 లక్షల మందికి పెన్షన్లు సకాలంలో ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీపై అధికార వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. వైసీపీ నేతలు చెప్పగానే రాజీనామాలు చేయ డానికి వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా… లేక వైసీపీ కార్యకర్తలా అంటూ నిలదీశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా జగన్ సర్కార్‌కు బుద్ది చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ సర్కారుపై సీపీఐ నేత రామకృష్ణ ఫైర్
0
223
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


