ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తెరకెక్కిస్తున్న ‘పఠాన్’ సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఎందుకంటే ఇప్పటికి షారూఖ్ ఖాన్ సినిమా విడుదలై దాదాపు ఐదేళ్లు కావస్తోంది. 2018లో తన ఆఖరి సినిమా ‘జీరో’ చేసిన షారూఖ్ ఖాన్ అంతకు ముందు కూడా సరైన హిట్స్ లేక మంచి కథ కోసమని ఆగి, ఐదేళ్లుగా ప్రాణం పెట్టి మరీ తీస్తున్న సినిమా పఠాన్…
కొత్త సంవత్సరం జనవరిలో విడుదలవుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తోంది. ఇంతకుముందు వీరు నటించిన ఓంశాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్ రెండూ బ్లాక్ బ్లస్టర్ కావడంతో ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని షారూఖ్ భావించి తీసుకున్నట్టున్నారు.
అందుకు తగినట్టుగానే దీపికా కూడా తన శక్తి వంచన లేకుండా నటించిందనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ‘బేషరమ్ రంగ్’ అనే రొమాంటిక్ పాటను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. విశేషం ఏమిటంటే ఇంతకుముందు సినిమాల్లా కాకుండా దీపికా ఆ పాట మొత్తం కూడా బికినీతోనే నటించింది. ప్రస్తుతం ఈ పాట నెట్టింటిని షేక్, షేక్ చేస్తోంది.
ఇంత గొప్పగా షేక్ చేస్తున్న ఈ పాట ఏమిటా? ఏముంది ఇందులోనని, ఆ పాటను చూసిన మధ్యప్రదేశ్ హోంమంత్రి భాజాపా సీనియర్ నేత నరోత్తమ్ మిశ్రా నిజంగానే షేక్ అయ్యారు.వెంటనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో దీపికా వస్త్రధారణ తీవ్ర అభ్యంతరకరంగా ఉందని వ్యాక్యానించారు. అంతేకాదు తాను చెప్పిన సీన్స్ కట్ చేయకపోతే ఈ రాష్ట్రంలో సినిమాని ఆడనివ్వమని, అంతేకాదు దేశంలో కూడా ఎలా విడుదల చేస్తారో చూస్తామని వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది.
సందట్లో సడేమియాలా చాలామంది ఈపాటను కట్ చేసినా చేసేస్తారని భావించి ఒకటికి రెండుసార్లు చూసేస్తున్నారు. చూడనివాళ్లకి మాత్రం హోంమంత్రి వ్యాక్యలతో అసలేముంది? ఇందులోనని చూసేస్తు న్నారు. దాంతో ఈపాట చూసేవారి సంఖ్య రోజురోజుకి రెట్టింపైపోతోందనే వ్యాక్యానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి.