రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండి పడ్డారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు సత్యాగ్రహ దీక్షలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేతగాకే హామీల గురించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతులను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ కు ఈసారి గుణపాఠం తప్పదన్నారు. ఒక పక్క ప్రాజెక్టులలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా.. పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ..కేవలం లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు హంగామా చేస్తోందని ఆరోపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ లోని రెండు పార్లమెంట్ స్థానాలను బిజెపి కైవాసం చేసుకోబోతోందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – డీకే అరుణ
0
206
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


