బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చింది. దానిలోని విధివిధానాలకు సంబంధించిన పోర్టల్‌ను ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఆవిష్కరించారు. UCC ద్వారా పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని సీఎం పుష్కర్‌సింగ్ ధామి తెలిపారు. ఉత్తరాఖండ్‌కే కాకుండా యావత్ దేశానికి చారిత్రాత్మకమైన రోజని.. దేశంలో యూసీసీని అమలుచేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలుతో నిజమైన మహిళా సాధికారత కనిపిస్తుందని తెలిపారు. వారి హక్కులను కాలరాసే బాల్య వివాహాలు, ట్రిపుల్ తలాక్, విడాకులు, ఆస్తుల వారసత్వం, బహుభార్యత్వం వంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపడానికి యూసీసీ తోడ్పడుతుందని ధామి తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి
0
197
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


