తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో సీఎం భేటీ కానున్నారు. కొత్త పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై..కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలతో సీఎం చర్చించనున్నారు. అలాగే, రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభోత్సవానికి సోనియాని ఆహ్వానించనున్నారు సీఎం. ఇక, వరంగల్‌లో రైతు కృతజ్ఞత సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను ఆహ్వానించనున్నారు.