రుణమాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని ప్రకటించి ఆ తర్వాత మాటను నిలబెట్టుకోలేక ప్రతిపక్షాల నోరుకు పని చెప్పారు. దీంతో రేవంత్ వర్సెస్ విపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ గట్టిగానే నడిచింది. ఆ సమయంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా సాగింది. దీంతో మరోసారి ఆగష్ట్ 15 నాటికి రుణమాఫీ చేస్తా నని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు రుణమాఫీపై కసరత్తు చేస్తు న్నారు సీఎం రేవంత్. త్వరలోనే రైతులకు శుభవార్తు చేప్పేందుకు సిద్ధమవుతున్నారు. రుణమాఫీ కసరత్తు నేపథ్యంలో త్వరలోనే కేబినెట్ నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రుణమాఫీపై రైతులు, రైతు సంఘాల నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వారితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అయితే, సంపన్నులకు రైతుబంధు, రుణమాఫీ ఇవ్వొద్దని రైతుల నుంచి సూచన లు అందినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల్లో సీలింగ్ తప్పని సరిగా ఉండాలన్న వినతుల మేరకు. అర్హులైన రైతులకే సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్
0
209
Previous article
Next article
Latest Articles
తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కుంపటి.. పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత
దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజురోజుకీ ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. ఉత్తర భారతం నుంచి తెలుగు రాష్ట్రాల వరకు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్..ఛత్తీస్‌గఢ్, ఏపీలో...
- Advertisement -
- Advertisement -


