పోచారం శ్రీనివాస్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోచారంను ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. సీఎం రేవంత్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరేం దుకు సిద్ధమైన నేపథ్యంలో పోచారం ఇంటికి సీఎం రేవంత్ వెళ్లారు. అదే సమయంలో పోచారం శ్రీనివాస్ ఇంటికి బాల్క సుమన్, బీఆర్‌ఎస్ నేతలు వెళ్లారు. సీఎం రేవంత్ ఇంట్లో ఉండగానే అక్కడకు బీఆర్ఎస్ నేతలు రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పేలవమైన ప్రదర్శన కనబరిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత దిగ జారింది. అధికారం కోల్పోవడంతో ఇప్పటికే పలువురు కీలక నేతలు పక్క పార్టీల్లో చేరారు. తాజాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పోచారం నివాసంలో రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకం గా కలిశారు. పోచారం శ్రీనివాస్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. రేవంత్ వెంట మంత్రి పొంగులేటి ఉన్నారు.
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
0
369
Previous article
Next article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


