తెలంగాణలో జరిగిన రెండు ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌

   తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బాలిక అత్యాచారం, హత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు. పోక్సో చట్టాన్ని, ఐపీసీ చట్టాన్ని వినియోగించి, ఫోరెన్సిక్‌ను సమర్థంగా వాడుకొని కేసును పకడ్బందీగా విచారణ చేసి అతిత్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు.

  పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన అమానుష ఘటనపై ముఖ్య మంత్రి రేవంత్​ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.

  మరోవైపు నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలో పట్టపగలు గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై కూడా రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. భౌతిక దాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే, అక్కడి బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా కఠిన చర్యలు తీసుకో వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.భూవివాదం కారణంగా నారాయణపేట జిల్లా ఉట్కూరులో సంజీవ్‌ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనను రాష్ట్ర సర్కారు సీరియస్‌గా తీసుకుంది. భౌతిక దాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే, అక్కడి బాధ్యులైన పోలీసు అధికారు లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉట్కూరు ఎస్సై బిజ్జ శ్రీనివాసులును సస్పెండ్‌ చేశారు.

Latest Articles

నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ

మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్