గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తీరుతో సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తమయ్యారు. తమవైపు తిప్పుకున్న నేతలు మళ్లీ ఎక్కడ చేజారుతారోనన్న ఆందోళన మొదలవడంతో.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు రేవంత్. ఇందుకు మాజీ స్పీకర్, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసం వేదికైంది. విందు పేరుతో జరిగిన ఈ భేటీలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మినహా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వారితో రేవంత్ సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. తమకు న్యాయం చేస్తామని.. పదవులు, కాంట్రాక్ట్‌లు వంటి హామీలు ఇచ్చినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు చెప్పిన వారికే పదవులు వంటివి హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.