CM KCR Delhi Tour | జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ సత్తాను చాటేందుకు.. ఢిల్లీలో గులాబీ జెండాను ఎగురవేసేందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మే 4వ తేదీన ఢిల్లీలోని వసంత విహార్ లో నిర్మించిన BRS జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో రెండు రోజుల ముందే ఢిల్లీకి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో మే 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం అక్కడే ఉన్న రాజకీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అయితే సీఎం కేసీఆర్ మూడు, నాలుగు రోజులు అక్కడే ఉండనున్నారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో ఎవరెవరిని కలుస్తారు? ఏ విషయాలపై చర్చిస్తారన్న దానిపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠగా మారింది.
ఢిల్లీకి సీఎం కేసీఆర్… రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
0
323
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


