Stock Markets | దేశీయ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఆ కాసేపటికే నష్టాల్లోకి జారుకొన్నాయి. ఉదయం 9.25 సమయంలో సెన్సెక్స్ 73 పాయింట్ల నష్టంతో 60,575 ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో 17,906 వద్ద ట్రేడవుతున్నాయి. బెంగాల్ అండ్ అస్సాం కంపెనీ లిమిటెడ్, పీఐ ఇండస్ట్రీస్, గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్, తేజస్ నెట్‌వర్క్, ఈకేఐ ఎనర్జీ కంపెనీ షేర్ల ధరలు లాభాల బాటలో ఉన్నాయి. మిర్జా ఇంటర్నేషనల్, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రైట్‌కామ్ గ్రూప్, ట్రెంట్, మోతీలాల్ ఓస్వాల్ షేర్ల ధరలు నష్టాల్లో ఉన్నాయి.