సీఎం వైఎస్ జగన్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యం లో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా భవిత పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించ నున్నారు. సమక్షంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయి. రాష్ట్రం లో 90 కోట్లతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను సీఎం జగన్ వర్చువల్‌గా విశాఖ నుంచి ప్రారంభిస్తారు. అలాగే ఎంపీల్యాడ్స్ నిధులతో ఒక్కోటి 70 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లనూ సీఎం ప్రారంభిస్తారు.
విశాఖలో సీఎం జగన్ పర్యటన
0
266
Previous article
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


