ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. విశాఖ జిల్లా నుంచి విజయనగరం జిల్లాలోకి ఈ మధ్యాహ్నం ప్రవేశించిన జగన్ బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు వైసీపీ నేతలు. 15 వందల బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం నెల్లిమర్ల నియోజక వర్గంలో జగన్ యాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో విజయనగరం నియోజకవర్గం చెల్లూరు జంక్షన్ వద్ద బహిరంగ సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఇక బహిరంగ సభ అనంతరం చింతవలస, భోగా పురం, రణస్థలం, అక్కివలస చేరుకుంటారు. అక్కివలసలోనే రాత్రికి జగన్ బస చేస్తారు. జగన్‌కు జనం నీరాజనాలు పలుకుతున్నారు. మహిళలు, యువత, కార్మికులు స్వాగతం పలుకుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు. మళ్లీ విజయం సాధించి ముఖ్యమంత్రి రెండోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్సఝాన్సీ లక్ష్మి అన్నారు. విశాఖని అభివృద్ధి బాటలో నడిపించేది కేవలం వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు.
విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర
0
223
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


