విజయవాడ ముంపు ప్రాంతాల్లో మూడో రోజు సహయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి 2 వరకూ విజయవాడ కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు ఉన్నారు. సహాయ చర్యలు, వరద నిర్వహణను పర్యవేక్షించారు. కలెక్టరేట్ వద్ద బస్సులోనే బస చేశారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు సీఎం వెళ్లారు. సీఎంతోపాటు కలెక్టరేట్ వద్ద పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారు.
రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు. విజయవాడలోని వరద ముంచెత్తిన ప్రాంతాలను సందర్శించిన ఆయన.. ఇవాళ ఏరియల్ వ్యూ నిర్వహించనున్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం రంగంలోకి 30 బృందాలు రంగంలోకి దిగబోతున్నాయి. వరద బాధితులకు సాయం అందించేందుకు మరో 4 హెలికాప్టర్లను రప్పిస్తున్నారు.