పీసీసీ చీఫ్, కేబినెట్​ విస్తరణపై త్వరలో క్లారిటీ

  తెలంగాణ కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత ఐదు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్ర మంత్రులు సైతం హస్తినలోనే మకాం వేశారు. కొత్త అధ్యక్షుడిగి నియామ కం, మంత్రివర్గ విస్తరణ విషయాల్లో ఇంకా ఆలస్యం చేయకూడదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తున్న ది.

మరోవైపు పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న మధు యాష్కీ, మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే సోనియా గాంధీని కలిశారు. ఈ పదవి బీసీలకు ఇవ్వాలనే చర్చ సాగినట్లు సమాచారం. దీంతో వారిద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ మాదిగ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే సంపత్ కుమార్ కు చాన్స్ ఉందని అంటున్నారు.ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ మీటింగ్​లో కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్​ ఎంపికపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్ర కేబినెట్ లో ఆరు బెర్త్ లు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో రెండు పెండింగ్ లో పెట్టి మిగతా నాలుగు భర్తీ చేయాలని భావిస్తున్నారు. సామాజిక సమీకరణలు, జిల్లాల ప్రాతినిథ్యం, సీనియారిటీని బేరీజు వేసుకొని కేబినెట్‌లో బెర్త్ లు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎవరిని మంత్రి వర్గంలోకి తీసు కోవాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి భేటీ అవుతున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్