30.2 C
Hyderabad
Thursday, December 5, 2024
spot_img

‘సినిమాటికా ఎక్స్‌పో’ మూడో ఎడిషన్‌ను ఇంకా బాగా చేస్తాం: పి.జి. విందా

2004లో వచ్చిన అవార్డ్ విన్నింగ్ మూవీ గ్రహణంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పి.జి. విందా, తన అసాధారణ ప్రతిభతో అనతికాలంలోనే గొప్ప ఛాయాగ్రాహకుడిగా పేరు పొందారు. ది లోటస్ పాండ్ చిత్రంతో దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారు. రెండు దశాబ్దాలుగా సినీ రంగానికి సేవ చేస్తున్న పి.జి. విందా, ఎప్పటికప్పుడు నూతన సాంకేతికలను పరిచయం చేయడంలోనూ ముందుతుంటున్నారు. ఈ క్రమంలోనే సినిమా నైపుణ్యం మరియు సాంకేతిక ఆవిష్కరణల గొప్ప వేడుక ‘సినిమాటికా ఎక్స్‌పో’కు శ్రీకారం చుట్టారు. ఇటీవల హైదరాబాద్‌లోని నోవాటెల్ లో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎస్. కృష్ణన్, తెలంగాణ ప్రభుత్వ ITE&C మరియు పరిశ్రమలు & వాణిజ్యం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎందరో సినీ దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. సరికొత్త సాంకేతికతను పరిచయం చేయడంతో పాటు, యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ.. హైదరాబాద్‌ను సినిమా మరియు డిజిటల్ క్రియేటివిటీ కేంద్రంగా మలచడమే లక్ష్యంగా ‘సినిమాటికా ఎక్స్‌పో’ అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన పి.జి. విందా పలు ఆస్తికర విషయాలను పంచుకున్నారు.

– 2004 వచ్చిన గ్రహణం చిత్రంతో సినిమాటోగ్రాఫర్ గా నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి మీడియా నాకు ఇస్తున్న సపోర్ట్ ను మరువలేను. గ్రహణం సినిమాటోగ్రఫీకి నాకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. నిజానికి ఆ సమయంలో డిజిటల్ అంతగా లేదు. ఇండియాలో తొలుత డిజిటల్ చిత్రీకరణ జరుపుకున్న సినిమాల్లో గ్రహణం ఒకటి. రాబోయే ఐదు, పదేళ్లలో డిజిటల్ దే హవా ఉంటుందని అప్పుడే చెప్పాను. నా అంచనానే నిజమైంది.

– నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయం నేర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే, దాని గురించి తెలుసుకోవడానికి దేశ విదేశాలు వెళ్తుంటాను. ముఖ్యంగా విదేశాల్లో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ ఎక్స్‌పో లు, ఎగ్జిబిషన్ లు నిర్వహిస్తుంటారు. మన దేశంలో ప్రత్యేకంగా సినీ పరిశ్రమ కోసం ఆ స్థాయి ఎక్స్‌పో లు లేవు. అదే ఈ సినిమాటికా ఎక్స్‌పో కు బీజం పడేలా చేసింది.

– తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఎందరో గొప్ప దర్శకులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు ఉన్నారు. అలాగే హైదరాబాద్ సినీ రంగానికి అనువైన చోటు. షూటింగ్ కి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి, షూటింగ్ కోసం రావాలంటే అందరికీ అనువుగా ఉంటుంది. అయితే అన్నీ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సాంకేతికంగా వెనకబడిపోయాం. ముఖ్యంగా కొత్త కెమెరాలు, క్రేన్ లు, ఇతర ఎక్విప్ మెంట్ లు మనకు ఆలస్యంగా పరిచయమవుతున్నాయి. అందుకే ఈ సినిమాటికా ఎక్స్‌పో నిర్వహించాలని తలపెట్టాము. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎక్విప్ మెంట్ గురించి ముందే తెలుస్తుంది. దాంతో సాంకేతికంగా ఇంకా మెరుగైన సినిమాలను అందించగలము.

– తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో మేము నిర్వహించిన సినిమాటికా ఎక్స్‌పో మొదటి ఎడిషన్ కి గొప్ప స్పందన లభించింది. ఆ ఉత్సాహంతోనే రెండో ఎడిషన్ ని మరింత అద్భుతంగా నిర్వహించాలని నిర్ణయించాము. దీనికి ఏకంగా విశేష స్పందన లభించి, ఏకంగా 38 వేల మంది హాజరు కావడం అనేది ఆసియాలోనే రికార్డు.

– ఫిల్మ్ మేకింగ్ పై ఇప్పుడు ఎందరో ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. అందుకే సినిమాటికా ఎక్స్‌పో ద్వారా సాంకేతికతను పరిచయం చేయడం మాత్రమే కాకుండా, యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి తగు సూచనలు చేస్తూ సెమినార్లు నిర్వహించాము. సుదీప్ ఛటర్జీ, సత్యాంశు సింగ్, ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి సినీ ప్రముఖులు.. స్టోరీ రైటింగ్, సినిమాటోగ్రఫీ గురించి ఎంతో నాలెడ్జ్ ని పంచారు.

– ఈ స్పందన చూసిన తర్వాత సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ ను మరింత ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాము. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం రావడానికి అంగీకారం తెలిపాయి.

– తెలుగు సినీ ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా సహా అందరి మద్దతు ఉంది. అలాగే ప్రభుత్వం మరియు భాష, సాంస్కృతిక శాఖ మద్దతుతో ఈ సినిమాటికా ఎక్స్‌పో ని మరో స్థాయికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము.

– తెలుగు సాహిత్యం కోసం మా వంతు సహకారం అందించడంతో పాటు, యువ ప్రతిభ కోసం భవిష్యత్ లో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము.

Latest Articles

‘పా.. పా..’ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి

తమిళ బ్లాక్ బస్టర్ మూవీ డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుద‌ల చేయ‌బోతున్నారు. డిసెంబ‌ర్ 13న‌ ఈ మూవీ ఆంధ్ర, తెలంగాణతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్