జయహో భారత్‌.. చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ సక్సెస్‌ 

స్వతంత్ర వెబ్ డెస్క్ : ఇస్రో అంచనాలు తప్పలేదు. చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విక్రమ్‌ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్‌ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్‌ ల్యాండర్‌ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్‌ భారత్‌ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసి.. ల్యాండింగ్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. భారత కాలమానం ప్రకారం.. ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.44కి ల్యాండింగ్‌ ప్రక్రియ మొదలయ్యింది.

ఇప్పటివరకూ అన్ని దశలనూ సవ్యంగా పూర్తిచేసుకున్న చంద్రయాన్‌-3 .. దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండింగ్‌ మాడ్యూల్‌ చంద్రుడిపై కాలుమోపడంతో ప్రక్రియ పూర్తయ్యింది. జాబిల్లిపై అదీ దక్షిణ ధ్రువంలో కాలు మోపడంతో.. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్‌-2 ఫెయిల్యూర్‌ నుంచి నేర్చుకున్న పాఠంతో.. అలాంటి తప్పిదాలు లేకుంటే చంద్రయాన్‌-3ని పక్కాగా రూపొందించినట్లు ధీమా వ్యక్తం చేసిన ఇస్రో  చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ దేశం చంద్రుడిపై దక్షిణ ధ్రువంవైపు ల్యాండ్‌ కాలేదు. భారత్‌ ఆ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్