స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన బుధవారం రోజున రాజమహేంద్రవరం కారాగారం నుంచి ర్యాలీగా వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులను కలిసిన అనంతరం.. అభిమానులతో మాట్లాడారు. చంద్రబాబు అలిసి పోవటంతో ఇవాళ ఎవరినీ కలవకుండా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు ఇవాళ చంద్రబాబు సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌కు రానున్నారు. ఏఐజీ, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోనున్నారు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల చికిత్స కోసమే ఆయనకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదట తన ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌కు వచ్చి వైద్యులను కలవనున్నారు. 52 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే ఆయణ్ను చూసేందుకు లక్షల మంది అభిమానులు తరలి వచ్చారు. చంద్రబాబు కాన్వాయ్‌కు ఎదురెళ్లి విక్టరీ సింబల్ చూపిస్తూ సంబురాలు చేసుకున్నారు. వారందికీ అభివాదం చేస్తూ చంద్రబాబు వాహన శ్రేణి ముందుకు సాగింది.
నేడు హైదరాబాద్‌కు వెళ్లనున్న చంద్రబాబు
0
449
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


