వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో నేతలందరూ బానిసల్లా బతుకుతున్నారని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగానే ఉన్నామని.. తాము సిద్ధంగా లేమని భావిస్తే అది జగన్(Jagan) పగటికలే అని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు జగన్ కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారని.. అసెంబ్లీ ఎన్నికల్లో శాశ్వతంగా ఇంటికి పంపించేస్తారని జోస్యం చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా(Viveka) హత్యకేసు దేశ చరిత్రలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా మిగిలిపోతోదంన్నారు. ఇలాంటి కేసులో బాధితులకు న్యాయం జరగకపోతే వ్యవస్థల మీద నమ్మకం పోతుందన్నారు చంద్రబాబు.