Yadadri| ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వామి, అమ్మవారులకు ఆలయ అర్చకులు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు చేపట్టారు. ప్రధాన ఆలయంలోని ఆలయ ముఖమండపంలో సుమారు గంట పాటు లక్ష పుష్పార్చన పూజలు చేశారు అర్చకులు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ వేడుక జరిగింది. స్వామి, అమ్మవార్ల అనేక నామాలను స్మరిస్తూ.. లక్ష పుష్పార్చన చేశారు. అర్చకులు పూజలో పాల్గొన్న భక్తులకు ఏకాదశి విశిష్టతను తెలియజేశారు. ఈ వేడుకను చూసేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. స్వామి అమ్మవార్ల పుష్పార్చన సేవలో తరించారు.