పొత్తుల కోసమే చంద్రబాబు ఢిల్లీ పయనమా..?

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం హస్తినకు వెళ్లనున్నారు. ఆయన తన ఢిల్లీ పర్యటనలో ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారని సమాచారం. ఇప్పటికే అమిత్ షా చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వటంతో సాయంత్రం ఢిల్లీ వెళ్లిన వెంటనే ఆరుగంటలకు షాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో పొత్తులతో పాటు రాష్ట్ర విభజన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కేంద్రపెద్దలతో చంద్రబాబు అనూహ్య సమావేశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయ పరిస్థితులు, పొత్తులు, విభజన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో బీజేజీతో కలిసి పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఎన్డీఏ నుంచి చంద్రబాబు ప్రభుత్వం వైదొలిగినంది. ఆ తరువాత బీజేపీతో చంద్రబాబు కలిసిందిలేదు. అధికారికంగా కాకపోయినా ఓ సందర్భంగా చంద్రబా ప్రధాని మోదీ మాట్లాడుకున్నారు. దానికి మించి బీజేపీతో ఎటువంటి సత్సంబంధాలు లేవు. ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసిన తరువాత చంద్రబాబు తొలిసారి అమీషాతో భేటీ కాబోతున్నారు.2019 ఎన్నికలకు ముందు రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందంటూ ఎన్డీఏ నుంచి వైదొలిగిన టిడిపి.. ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో అమిత్ షా తో చంద్రబాబు భేటీ పై ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే ఏపీలో పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన కలిసి ముందుకెళ్లేందుకు సుముఖంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరితో పాటు బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. దీని కోసం బీజేపీ అధిష్టానాన్ని ఒప్పిస్తానని కూడా తెలిపారు పవన్. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో కలిసి ముందుకెళ్లేందుకు సుముఖంగా లేరన్నట్లుగా తెలుస్తోంది.టిడిపితో కలిసి వెళ్లేందుకు సుముఖంగా ఉన్న జనసేన ఏపీ బీజేపీ విముఖత చూపడంతో.. నేరుగా అధిష్టానం నుంచి పొత్తుల ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

Latest Articles

తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం

తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్‌ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపిస్తే... కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్‌ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్