స్వతంత్ర, వెబ్ డెస్క్: చంద్రబాబు 2014లో దొంగ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడని మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహంవ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నాలుగేళ్లు పూర్తి చేసుకోవడంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రాజా మాట్లాడుతూ.. చంద్రబాబు ఇచ్చిన హామీలకు 50 లక్షల కోట్లు కావాలన్నారు. చంద్రబాబు హయాంలో ఐటి ఎగుమతులు 500 కోట్లు ఉంటే.. జగనన్న ప్రభుత్వంలో 1500 కోట్లు ఉన్నాయని అన్నారు. ఈ రాష్ట్రానికి సంక్షేమం అందజేసింది డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, స్వర్గీయ ఎన్టీ రామారావు, ఆ తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.