స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వంపై రైతులను ఉసిగొల్పాలనే దురుద్దేశంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారని మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. పంట నష్టం అంచనాలకు సంబంధించిన సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఈనెల 25న వస్తుందని తెలిపారు. రైతు భరోసాతో కలిపి ఇన్ పుట్ సబ్సిడీ అందజేస్తామని అన్నారు. సీజన్ ముగిసేలోపే ఇన్ పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నామని తెలిపారు. తడిచిన, రంగు మారిన ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు.